హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

కలం, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగడ్ మార్గంలో శనివారం ఉదయం ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>