కలం, వెబ్ డెస్క్: మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు పంపిణీ చేసే ప్రసిద్ధ చేప ప్రసాదానికి (Bathini Fish Prasadam) ముహూర్తం ఖరారైంది. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని (Bathini Fish Prasadam) పంపిణీ చేయనుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు దేశవ్యాప్తంగా భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో మైదానంలో అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. సుదీర్ఘ కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా తగినన్ని చేప పిల్లలను సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత, వసతులు కల్పిస్తున్నారు.
Read Also: ప్రైజ్ మనీ పెంచకపోతే టోర్నీలు బహిష్కరిస్తాం: సబలెంక
Follow Us On : WhatsApp

