కలం, వెబ్ డెస్క్ : దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో అత్యంత ప్రమాదకరమైన రిసిన్ విషప్రయోగం ద్వారా సామూహిక హత్యాకాండకు పాల్పడాలనే ఐసిస్ బయో-టెర్రర్ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బట్టబయలు చేసింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై ఎన్ఐఏ అధికారులు చార్జ్‌షీట్ (NIA Chargesheet) దాఖలు చేశారు. నిందితులు నిషేధిత ఉగ్రవాద సంస్థ భావజాలంతో ప్రభావితమై ఈ ఘాతుకానికి ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో తేలింది. శాస్త్రీయ పద్ధతుల్లో విషపూరిత పదార్థాలను తయారు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీయడమే లక్ష్యంగా వీరు వ్యూహాలు పన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: వాంకిడిలో పట్టపగలే మోసం.. రైతును నమ్మించి నగదు చోరీ
Follow Us On : WhatsApp

