epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గెలుపోటముల్లో టాస్ కీలకం : KL రాహుల్

మ్యాచ్‌లో టాసే టర్నింగ్ పాయింట్ అని టీమిండియా వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) చెప్పాడు. టాస్ గెలవడంపై మ్యాచ్ గెలవడం కూడా ఆధారపడి ఉంటుందని, టాస్ గెలిచిన వ్యక్తి తీసుకునే నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదని అన్నాడు. రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa), భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమిపాలయింది. విరాట్ కోహ్లీ(Kohli), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది. భారత్ అందించిన 358 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఈ వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమిపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. టాస్ చాలా కీలకమని అన్నాడు.

టాస్‌ మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించిందని కేఎల్ రాహుల్ (KL Rahul) అంగీకరించాడు. “వెట్‌ బాల్‌తో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ కోల్పోవడం జట్టుకు నష్టమైంది. ఈ పరిస్థితుల్లో టాస్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుంది’’ అని చెప్పాడు. అనంతరం బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. 350 పరుగులు మంచి స్కోరు అనిపించినా, ఈ పరిస్థితుల్లో ఇంకా 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కొంచెం సపోర్ట్‌ ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఫీల్డింగ్, బౌలింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశామని, వాటిని సరిదిద్దాలని వివరించాడు. మూడో మ్యాచ్‌లో విజయం సాధించేందుకు మరింత మెరుగైన ప్రదర్శన అవసరమని రాహుల్‌ పేర్కొన్నాడు.

Read Also: నాకు సానుభూతి అక్కర్లేదు.. రాజ్ నిడుమోరు మాజీ భార్య కామెంట్

Follow Us On: WhatsApp Channel

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>