సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET)ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఢిల్లీలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11.00 గంటలకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని హెచ్‌కేఎస్ సూర్జిత్ భవన్‌లో ఈ సమావేశం జరగనున్నది. ఉపాధ్యాయుల ఉద్యోగాల రక్షణ, విద్యా రంగంలో సంక్షోభంపై చర్చించి తగిన ఐక్య కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ మేరకు ఎస్టీఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎన్ భార్తి, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఉద్యోగ విరమణకు 5 సంవత్సరాల పైబడిన సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్ళలో TET ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగాలనుండి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను తొలగిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఏర్పడుతుంది. విద్యారంగంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది.’ అని వారు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలువురు ఎంపీలు ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించినా ఎటువంటి స్పందన లేకపోవడం లేకపోవడం విచారకరమన్నారు. దేశంలోని ఉపాధ్యాయులందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Also: గెలుపోటముల్లో టాస్ కీలకం : KL రాహుల్
Follow Us On: X(Twitter)


