సమంత(Samantha), రాజ్ నిడుమోరు(Raj Nidimoru) పెళ్లిపై ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రాజ్ మాజీ భార్య శ్యామాలికి వీరిద్దరూ కలిసి అన్యాయం చేశారని సోషల్ మీడియా ఊగిపోతోంది. దీనిపై తాజాగా శ్యామాలి(Shhyamali) స్పందించింది. తాను సానుభూతి కోసం పాకులాడట్లేదని.. తన మీద ఇంత రచ్చ అవసరం లేదని తెలిపింది. ‘నా నుంచి మీరు ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ లు ఎక్స్ పెక్ట్ చేయొద్దు. నేను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వను. సమంత-రాజ్ నిడుమోరు(Raj Nidimoru) పెళ్లి చేసుకుంటే నా మీద అంతా జాలి చూపిస్తున్నారు. కానీ నేను ఆ విషమే పట్టించుకోవట్లేదు. నాకు మీ అందరి సపోర్ట్ దొరికినందుకు చాలా థాంక్స్’ అని తెలిపింది శ్యామాలి.
తన గురువు క్యాన్సర్ బారిన పడ్డాడని.. ఆ విషయంలోనే తాను బాధపడుతున్నట్టు తెలిపింది. ఆయన కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానని.. వేరే విషయాలు పట్టించుకునే టైమ్ లేదని చెప్పుకొచ్చింది శ్యామాలి. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్, శ్యామాలి 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారు.
Read Also: ‘ఏవీఎం’ సారథి శరవణన్ కన్నుమూత
Follow Us on: Facebook


