ఇంధన సంక్షోభం.. పొరుగు దేశాలకు భారత్​ సాయం

కలం, వెబ్​ డెస్క్​ : పశ్చిమాసియాలో (West Asia War) సంక్షోభం కారణంగా సప్లై చైన్​ సిస్టమ్ తీవ్రంగా నష్టపోయింది. ఈ కారణంగా చిన్న దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ ఇంధన భద్రతా చట్రాలు అత్యంత కీలకంగా మారాయి. దిగుమతులపై అంతరాయం ఏర్పడిన వేళ చిన్న దేశాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న వేళ ద్వైపాక్షిక సంబంధాలు కీలకం కానున్నాయి. ఇంధన సంక్షోభం కారణంగా భారతదేశం శ్రీలంక, బంగ్లాదేశ్​ లకు అండగా నిలబడింది. సంక్షోభంలో అత్యవసర సాయం కింద శ్రీలకంకు 38వేల మెట్రిక్​ టన్నుల ఇంధనాన్ని (Indian Fuel Shipment) చేరవేసింది. ఇందులో 20వేల మెట్రిక్​ టన్నుల డీజిల్​, 18వేల మెట్రిక్​ టన్నుల పెట్రోల్​ ఉంది.

అలాగే, పొరుగు దేశం బంగ్లాదేశ్​ కు (Bangladesh) కూడా 5 వేల మెట్రిక్​ టన్నుల డీజిల్​ పంపించింది భారత్​. అమెరికా, ఇజ్రాయెల్​ – ఇరాన్​ వార్​ ప్రారంభమైనప్పటి నుంచి 15వేల టన్నుల ఇంధనం తమ దేశానికి భారత్​ అందించింది అని బంగ్లాదేశ్​ వెల్లడించింది. రాబోయే నెలలతో మరో 45 వేల టన్నులు సరఫరా కానుందని బంగ్లా పెట్రోల్​ కార్పొరేషన్​ తెలిపింది. అయితే, ఈ సంక్షోభంలో భారత్​ పొరుగు దేశాలకు ఇంధనం పంపడం (Indian Fuel Shipment) చేయడం అవసరమా? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మనకు లేకున్నా ఇతరులకు ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) కూటమిలోని అత్యవసర ఇంధన సరఫరా నియామవళి కింద భారత్​ ఈ సాయం చేసింది.

Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>