కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (Raja Saab) మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో జోరు పెంచేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. రేపు రిలీజ్ చేస్తామని ఫ్యాన్స్ రెడీగా ఉండాలన్నారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఈ రోజు రిలీజ్ అవుతుందేమో అని ఉదయం నుంచి వెయిట్ చేశారు. మూవీ టీమ్ నుంచి అప్డేట్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉన్నారు. కానీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్.
ది రాజాసాబ్ (Raja Saab) ట్రైలర్ ఇంకా రెడీ కాలేదని.. అన్నీ రెడీ అయ్యాక తామే అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. త్వరలోనే దానిపై అప్డేట్ ఇస్తామని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇలా ఎందుకు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ త్వరగా ప్రకటించకపోతే ఊరుకునేది లేదంటూ ఇంకొందరు డిమాండ్స్ చేస్తున్నారు.
Read Also: ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేశ్ బాబు
Follow Us On: Sharechat


