కలం, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత కీలకమైన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (TFCC Elections) ముగిశాయి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన టీఎఫ్ సీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేశ్ బాబు (Suresh Babu) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నాగవంశి, దామోదర్ ప్రసాద్ లు గెలిచారు. ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, కొత్త బృందంతో తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కొత్త నాయకత్వం వెల్లడించింది.
Read Also: ది రాజాసాబ్ ట్రైలర్.. ఫ్యాన్స్ కు నిరాశే..
Follow Us On: Pinterest


