కలం, వెబ్ డెస్క్ : నంద్యాల (Nandyal) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఎస్సార్బీసీ కాలువ వద్ద ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను నీటిలోకి తోసేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎస్సార్బీసీ కాలువలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతులను నంద్యాల (Nandyal) జిల్లా ఒండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, ఆమె కుమార్తెలు వైష్ణవి (4), సంగీత (5)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలు ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. లక్ష్మీదేవి భర్తతో గత కొంతకాలంగా వివాదాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Also: పాక్ టీమ్‌లోకి షాదాబ్ రీఎంట్రీ
Follow Us On: Instagram


