కలం, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ట నటించిన అఖండ 2 చివరి నిమిషంలో వాయిదా పడటంతో టాలీవుడ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అఖండ వాయిదా ఇతర మూవీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ది రాజాసాబ్ (Raja Saab) మూవీ విడుదలపై రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుండటంతో రాజాసాబ్‌పై రూమర్స్ వస్తున్నాయి.
ఈ పుకార్లకు చెక్ పెడుతూ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్(TG Vishwa Prasad) క్లారిటీ ఇచ్చారు. “ది రాజా సాబ్ (Raja Saab) కోసం మేం పెట్టుబడులను క్లియర్ చేసాం. సెటిల్మెంట్లు మా అంతర్గత నిధుల ద్వారా జరిగాయి. కొంత వడ్డీ మిగిలింది. సినిమా రిలీజ్ చేసేముందు అవి కూడా క్లియర్ చేస్తాం” అని చెప్పారు.
చివరి నిమిషంలో ఎదురయ్యే అడ్డంకులు మొత్తం సినిమాను ఎలా దెబ్బతీస్తాయో అనే విషయంపై కూడా విశ్వ ప్రసాద్ రియాక్ట్ అయ్యారు. “ఓ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయిప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, టెక్నిషియన్స్, నిర్మాతలు, నటులు చాలామంది జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. సినిమా విడుదల సమయంలో చట్టపరమైన మార్గదర్శకాలను రూపోందించడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. కాగా ‘ది రాజా సాబ్’ సినిమా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ నెల కూడా అంతా ప్రమోషన్లు కొనసాగుతాయి. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also: అఖండ 2.. ఏ సినిమా మీద పడుతుందో..?
Follow Us On: Instagram


