కలం, వెబ్‌డెస్క్ : మద్యం తాగి వాహనాలు నడిపితే వదిలేది లేదని, శిక్ష తప్పదని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అయినా మందుబాబులు తగ్గదే లే.. అంటూ చుక్కేసి బండ్లు నడుపుతున్నారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) టెస్టుల్లో వేలాదిమంది దొరికి కేసుల పాలవుతున్నారు. వీకెండ్ సందర్భంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి మందుబాబుల ఆటకట్టిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 426 మంది మందుతాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకున్నవారిలో అత్యధికంగా టూవీలర్స్ నడిపేవాళ్లే ఉన్నారు.
323 టూ వీలర్, 17 మంది త్రీ వీలర్, 85 మంది ఫోర్ వీలర్, ఒకరు హెవీ వెహికిల్ నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మందుతాగుతూ వాహానాలు నడిపిన వారిలో ఎక్కువగా 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లే ఉన్నారు. 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 310 మంది ఈ ఏజ్ వాళ్లే ఉండడం గమనార్హం. 18 నుంచి 20 ఏళ్ల ఉన్న ఏడుగురు, 41 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న 77 మంది, 61 పైబడిన వాళ్లు 8మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) కేసులు నమోదయ్యాయి.
Read Also: లోకేశ్ డల్లాస్ టూర్‌పై వైసీపీ ట్రోల్స్
Follow Us On: Instagram


