కలం, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ (Raja Saab) సినిమాకు ఏపీలో ప్రీమియర్ షోస్ కు టికెట్ రేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1000, 800, 600 రూపాయలుగా టికెట్ రేట్లు ఖరారు చేశారు. పది రోజుల పాటు ఈ పెంపు వర్తిస్తుంది. అంటే సంక్రాంతి హాలీడేస్ దాదాపుగా కవర్ అవుతాయి. నార్త్ లోనూ ఈ సినిమా దాదాపు 4500 స్క్రీన్స్ లో భారీగా రిలీజ్ అవుతోంది. తమిళనాట దాదాపు 200 స్క్రీన్స్ పడుతున్నాయి. బెంగళూరుతో పాటు మిగిలిన కర్నాటకలో డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంతా బాగానే ఉంది.
అయితే నైజాం ఏరియాలోనే ప్రీమియర్స్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదు. జీవో జారీ అయితే ఈ రోజు ప్రీమియర్స్ కు అవకాశం ఉంటుంది లేదంటే సినిమా రిలీజ్ అవుతున్న 9వ తారీఖు నుంచే రాజా సాబ్ ను థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలి. నైజాం ప్రీమియర్స్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి తమ వైపు నుంచి అప్పీల్ చేశామని, వారు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
నైజాంలో గురువారం నుంచి అన్ని ఏరియాల్లో కావాల్సినన్ని థియేటర్స్ రాజా సాబ్ కు వస్తాయని నమ్మకాన్ని విశ్వప్రసాద్ వ్యక్తం చేశారు. సినిమా ఫస్ట్ డే దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వరల్డ్ వైడ్ సాధిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పుష్ప2 సినిమా తొక్కిసలాట జరిగినప్పటి నుంచి తెలంగాణలో ప్రీమియర్స్ విషయంలో ప్రభుత్వం నుంచి అంత సులువుగా అనుమతులు రావడం లేదు. రాజా సాబ్ కు కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోంది.
Read Also: అలాంటి సినిమాలు చేసి బోర్ కొట్టింది : ప్రభాస్
Follow Us On : WhatsApp


