కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా తాను నటించిన బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీ “ది రాజాసాబ్ ” (The Rajasaab) ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో “స్పిరిట్” (Spirit) అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా తన కెరీర్ లో చేసిన సినిమాల గురించి ప్రభాస్ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తాను మొదటి నుంచి యాక్షన్ సినిమాలే చేశానని.. ఒకానొక సమయంలో అలాంటి జానర్ సినిమాలు చేసి బోర్ కొట్టిందని ప్రభాస్ అన్నారు. అందుకే 15 ఏళ్ల క్రితం ‘డార్లింగ్’ సినిమా చేశాను. అది వర్కౌట్ అయ్యే సినిమా కాదని అంతా అన్నారు. కానీ ఆ సినిమా బాగా ఆడింది. ఇప్పుడు కూడా వరుసగా యాక్షన్ సినిమాలు చేసి బోర్ కొట్టి రాజాసాబ్ లో నటించానని ప్రభాస్ (Prabhas) తెలిపారు.
Read Also: నైజాంలో రాజా సాబ్ ప్రీమియర్స్ పై రాని క్లారిటీ
Follow Us On: Sharechat


