ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే .. స్పెషల్ పోస్టర్ రిలీజ్

కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ది ప్యారడైజ్” (The Paradise). ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నేడు (ఏప్రిల్ 11) కయాదు లోహర్ (Kayadu Lohar) బర్త్‌డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఈ బ్యూటీ ‘సుబ్బు’ అనే పాత్రలో నటిస్తుంది. రిలీజ్ చేసిన పోస్టర్‌లో కయాదు లోహర్ సైకిల్‌పై గ్రామీణ నేపథ్యంలో ప్రయాణిస్తూ కనిపిస్తోంది. పాతకాలపు కాస్ట్యూమ్స్‌లో, సహజమైన లుక్‌తో ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించగా, ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>