Mobile Popup Ad
Mobile Popup Ad

‘స్వయంభూ’ అప్‌డేట్.. 16న ఫస్ట్ సింగిల్ రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) కార్తికేయ-2 తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu Movie) తో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ‘రా రా ధీవర’ అంటూ సాగే పాటను ఈ నెల 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ లో నిఖిల్ ఒక యోధుడిలా, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచడంతో నిర్మాతలు త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ భువన్, టాగోర్ మధు సమర్పణలో స్వయంభూ (Swayambhu Movie) భారీ చారిత్రక యాక్షన్ సినిమాగా రూపొందుతోంది. సినిమాటోగ్రఫీ కేకే సెంథిల్ కుమార్, రవి బస్రూర్ సంగీతాన్ని రవి బస్రూర్ సమకూర్చగా, హిరోయిన్లుగా సంయుక్త, నభా నటేష్ నటిస్తున్నారు.

Read Also: ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>