ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఉందా?.. ఈ సమస్యలు ఖాయం!

కలం, వెబ్‌డెస్క్: ఫాస్ట్ ఫుడ్ (Fast Food) అనేది ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార సంస్కృతి. ఆర్డర్ ఇచ్చిన కొన్ని నిమిషాలలోనే వేగంగా తయారు చేసి అందించే ఈ ఫుడ్‌ను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహారాలలో మొదటిది ఫాస్ట్ ఫుడ్‌‌గా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండే వారికి వండుకునే సమయం లేనపుడు ఫాస్ట్ ఫుడ్ ప్రత్యామ్నాయంగా మారింది. పిజ్జా, బర్గర్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, చాట్ ఇలా చాలా రకాలే ఉన్నాయి.

ఇందులో వాడే మసాలాలు, సాస్‌లు, టేస్టింగ్ సాల్ట్ నాలుకకు ఎంతో రుచిని ఇస్తాయి. అయితే ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉన్నప్పటికీ, అది మన ఆరోగ్యానికి మెల్లగా ప్రమాదంగా మారుతుంది. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అనేక సమస్యలకు ఫాస్ట్ ఫుడ్ కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఫాస్ట్ ఫుడ్‌ను “స్లో పాయిజన్” గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలోని సహజ జీవక్రియలను దెబ్బతీసి అనేక రకాల వ్యాధులకు కారణమవుతాయి.

పోషకాల లోపం (Nutrient Ddeficiency)

వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు (Fats) ఎక్కువగా ఉంటాయి, కానీ శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం (Fiber) అస్సలు ఉండవు. అందుకే వీటిని “జంక్ ఫుడ్” (Junk Food) అని కూడా పిలుస్తారు.

ఊబకాయం (Obesity):

అధిక కేలరీలు ఉండటం వల్ల బరువు వేగంగా పెరుగుతారు.

గుండె జబ్బులు & మధుమేహం

వీటిలో వాడే రీ-యూజ్డ్ ఆయిల్ (మళ్లీ మళ్లీ మరిగించిన నూనె) వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వీటిని తరచుగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో శరీరంలోని ఇన్సులిన్ పనితీరు దెబ్బతిని టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న వయస్సులోనే షుగర్ సమస్యలు రావడానికి ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ప్రధాన కారణాల్లో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు.

జీర్ణక్రియ సమస్యలు

మైదా పిండి, కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఫాస్ట్ ఫుడ్ అనేది ఎప్పుడో ఒకసారి సరదాగా తినడానికి పర్వాలేదు, కానీ దాన్నే అలవాటుగా మార్చుకుంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు.

Read Also: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>