కలం, సినిమా : టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. కానీ చికిత్సకు అవసరమైన డబ్బులు ఆమె వద్ద లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను క్యాబ్‌లో తిరిగి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెను ఓ జంక్షన్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు పక్కన అయోమయ స్థితిలో ఉన్న పావలా శ్యామలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఆర్కే ఫౌండేషన్ సహకారంతో ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు.
సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) స్పందించారు. తన మేనేజర్‌ల ద్వారా ఆమె ఏ హాస్పిటల్‌లో ఉందో తెలుసుకొని, ఆ హాస్పిటల్ డాక్టర్స్‌తో ఫోన్‌లో మాట్లాడి.. నటి శ్యామల (Pavala Syamala) ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులు తానే భరిస్తానని, ఆమె పూర్తిగా కొలుకునే వరకు వైద్య సదుపాయాలు అందించాలని దిల్ రాజు తెలిపారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. కష్టకాలంలో సీనియర్ నటికి అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజును అందరూ ప్రశంసిస్తున్నారు.
Read Also: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
Follow Us On: Instagram

