యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ (Yadadri Thermal power Plant) ‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్-3 బాయిలర్‎లో ఆయిల్ లీకై మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో గల టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఆదివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు.

పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ లీకేజీ కావడం వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ ఆవరణ అంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్లాంటులో (Yadadri Thermal Plant) అగ్ని ప్రమాద ప్రమాద ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అధికార యంత్రాంగం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది.

Read Also: బండి సంజయ్‌ కేంద్రమంత్రి పదవిలో కొనసాగడం అవమానకరం : కేటీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>