Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీలో సమ్మె సైరన్.. తేదీ ప్ర‌క‌టించిన జేఏసీ!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ‌లో ఆర్టీసీ (TGSRTC) కార్మికులు స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 22 నుంచి సమ్మె (Strike) చేయ‌నున్న‌ట్లు ఆర్టీసీ వర్కర్స్ జేఏసీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు జేఏసీ లేబర్ కమిషనర్‌, ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు అంద‌జేసింది. నేడు లేబ‌ర్ క‌మిష‌న‌ర్‌తో ఆర్టీసీ వర్కర్స్ జేఏసీ చ‌ర్చ‌లు జ‌రిపింది. చ‌ర్చ‌లపై జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే మార్చి 13న ఆర్టీసీ యాజ‌మాన్యానికి కార్మికులు స‌మ్మె నోటీసులు ఇచ్చారు. అయితే ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఆ నోటీసుల‌పై స్పందించ‌లేదు.

దీంతో కార్మికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ప్రభుత్వం త‌ప్పించుకునే ధోరణి ప్ర‌ద‌ర్శిస్తోందని ఆరోపించారు. ఎన్నిక‌ల మ్యానిపెస్టోలో ఉన్న‌వే అడుగుతున్నామ‌ని, ఎందుకు ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కార్మికుల‌ వేతనాల పెంపు ఇతర స‌మ‌స్య‌ల‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22 నుంచి సమ్మె (TGSRTC Strike) చేస్తామ‌ని, దీనికి పూర్తిగా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని జేఏసీ ప్ర‌క‌టించింది.

Read Also: తేనె పవర్ అంతా ఇంతా కాదు.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>