కలం, వెబ్ డెస్క్ : జనవరి 28 నుంచి 31 దాకా జరగబోయే మేడారం జాతరకు (Medaram Jatara) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) 3,495 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్టు స్పష్టం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ప్రత్యేకంగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఆర్టీసీకి ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతికి నడుపుతున్న బస్సుల్లోనూ 50 శాతం అదనపు ఛార్జీలు పెంచేశారు.
గత మేడారం జాతరకు (Medaram Jatara) 3,491 బస్సులను ఆర్టీసీ నడిపినా.. అవి సరిపోక ప్రయాణికులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. ఈ సారి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరం అయితే మరిన్ని బస్సులు పెంచుతామని ఆర్టీసీ తెలిపింది. ఇక మేడారం జాతరకు సంబంధించిన పూర్తి వివరాలను వాట్సాప్ లో తెలుసుకోవచ్చని మంత్రి సీతక్క తెలియజేశారు. 7658912300 నెంబర్ కు భక్తులు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. మేడారంకు చేరుకునే రోడ్లు, ట్రాఫిక్ విషయాలు, టాయిలెట్లు, హెల్త్ క్యాంపులతో పాటు ఇతర విషయాలను కూడా అందులోనే తెలుసుకోవచ్చని మంత్రి సీతక్క వివరించారు.
Read Also: మధిర అభివృద్ధికి భారీగా నిధులు: భట్టి
Follow Us On: Sharechat


