కలం, నల్లగొండ బ్యూరో: సంక్రాంతి (Sankranti Rush) పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిక్కిరిశాయి. శనివారం నుంచి మంగళవారం విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వరంగల్ హైవేపై వాహనాలు బారులుదీరాయి. సోమవారం వాహనాల రద్దీ కాస్తంత తగ్గుముఖం పట్టింది. ఏపీ వాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలు సైతం భోగి, సంక్రాంతి వరుస సెలవుల వల్ల సొంతుళ్ళ బాట పట్టారు. దీంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. జాతీయ రహదా 65పై పెదకాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గత 4 రోజుల్లో 2 లక్షలకు పైగా వాహనాలు టోల్‌గేట్ దాటినట్లు అంచనా.
Read Also: జిల్లా, మండలాల మార్పుకు బ్రేక్ !
Follow Us On : WhatsApp


