ప్రయాణికులకు రిలీఫ్.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) సమ్మె ముగిసింది. మంత్రుల కమిటీ, ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విజయవంతం కావడంతో, కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో మంత్రుల బృందం, కార్మికుల సంఘాల మధ్య సుమారు 12 గంటల పాటు చర్చలు జరిగాయి. కార్మికులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది. చర్చల అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు.

బస్సు సర్వీసుల పునరుద్ధరణ..

అర్థరాత్రి నుంచే కొన్ని దూరప్రాంత సర్వీసులను పునరుద్ధరించారు. ఉదయం మార్నింగ్ షిఫ్ట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో బస్సులు యథావిధిగా రోడ్డెక్కాయి. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది. గత మూడు రోజులుగా బస్సులు లేక సామాన్య ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేయడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడింది. ప్రస్తుతం బస్సులు అందుబాటులోకి రావడంతో బస్టాండ్లు మళ్ళీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం, కార్మికుల మధ్య కుదిరిన ఈ సమ్మతిపై అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>