Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ చరిత్రలో మైలురాయి : పొన్నం ప్రభాకర్

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలించింది. జేఏసీ కీలక డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకరించడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ట్వీట్ చేశారు. ఆర్టీసీ చరిత్రలోనే మైలు రాయి లాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నదని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్ లో సమస్యకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపించిందని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయాలు

‘ఆర్టీసీ జేఎసితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. 11% పీఆర్సీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు ప్రజా పాలన ప్రభుత్వం తీసుకున్నది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపినందుకు ప్రభుత్వం‌కు ఆర్టీసీ జేఎసి ధన్యవాదాలు తెలిపింది.’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. మొత్తంగా ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే విలీన ప్రక్రియను మొదలుపెట్టాలంటూ వారు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>