Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగస్వాములు కావొద్దు: జేఏసీ

కలం, వెబ్ డెస్క్: తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) జేఏసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల కోసం బయటి వ్యక్తులను యాజమాన్యం అపాయింట్ చేస్తోంది. అయితే తమ సమ్మెకు ఇబ్బంది కలిగించేలా యాజమాన్యం చేస్తున్న చర్యలపై ఉద్యోగుల సమాఖ్య (JAC Protest) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలిక డ్రైవర్లను ఆర్టీసీ విధుల్లోకి రావొద్దని సూచిస్తోంది.

ఇంకేదైనా పని చూసుకోవాలని.. మీకు అర్హత ఉంటే సమ్మె ముగిసిన తర్వాత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జేఏసీ ప్రతినిధులు సర్ది చెబుతున్నారు. ఆర్టీసీని (TGSRTC) నిర్వీర్యం చేసే కుట్రలో మీరు భాగస్వాములు కావద్దని సూచిస్తున్నారు. తమ బాధను సైతం అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్ డిపో సమీపంలో వీఎస్టీ వద్ద మూడవ నెంబర్ రూట్‌లో వెళ్లేందుకు డిపో నుండి బయలుదేరిన బస్సును ఆపి జేఏసీ నేతలు డ్రైవర్‌కు హితబోధ చేశారు.

Read Also: ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>