రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్(Riyaz Encounter)పై తెలంగాణ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. సోమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసుకున్నట్లు మానవ హక్కుల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నవంబర్ 24లోపు అందించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించింది మానవ హక్కుల సంఘం.
Riyaz Encounter | చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకి అని చెప్పి లేచాడు. అదే సమయంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేసి వారి దగ్గర ఉన్న గన్‌ను లాక్కున్నాడు. ఈ ఘర్షణలో ఓ కానిస్టుబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందకు రియాజ్ ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ ఘటన జీజీహెచ్‌లో చోటు చేసుకోగా.. రియాజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది.
Read Also: జూబ్లీహిల్స్ ప్రచారంలో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు..

