జూబ్లీహిల్స్(Jubilee Hills) ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన రహమత్ నగర్ ప్రచారంలో జరిగింది. నవీన్ యాదవ్ అనుచరులు, భవానీ శంకర్ అనుచరుల మధ్య ఈ గొడవ జరిగింది. కొంతకాలంగా కాంగ్రెస్ సర్కార్‌పై భవానీ శంకర్ తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈక్రమంలోనే ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుచరులు.. టికెట్ పొందిన నవీన్ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడుల చేసుకున్నాయి. దీంతో వెంటనే మిగిలిన వారు జోక్యం చేసుకుని వీరిని విడదీశారు.
Read Also: ‘ఫిరాయింపులు పార్టీలే కాదు.. మాటలు ఫిరాయిస్తున్నారు’

