టీజీ ఐసెట్ 2026 కు సర్వం సిద్ధం : కన్వీనర్

కలం, నల్లగొండ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే ఐసెట్ 2026 (TG ICET 2026 ) ను రెండవ పర్యాయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అలువాల రవి తెలిపారు. మే 13, 14వ తేదీల్లో మూడు విడతల్లో నిర్వహించనున్న టీజీ ఐసెట్ కు 56,223 మంది విద్యార్థుల్లో 30,308 మంది మహిళలు, 25,915 మంది పురుషులు, దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మే 13న మొదటి స్పెషల్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, రెండవ స్పెషల్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు, 14 మే మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. దివ్యాంగులు మరియు ఉర్దూ విద్యార్థులకు మే 13 మధ్యాహ్నం 2వ సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లలో, 69 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు 100 పరిశీలకులతో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చేసినట్లు కన్వీనర్ ఆచార్య అలువాల రవి తెలిపారు. మొదటి సెషన్ విద్యార్థులు ఉదయం 8:30 నుండి, రెండవ సెషన్ ఒకటిన్నర నుండి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. మొదటి సెషన్ విద్యార్థులు 9:45 నిమిషాల తర్వాత , రెండవ సెషన్ విద్యార్థులకు 1:45 నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. టీజీ ఐసెట్ (TG ICET 2026) రెండవ పర్యాయం నిర్వహిస్తున్న దృష్ట్యా మరింత బాధ్యతగా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Read Also: రాష్ట్రాన్ని రెండుగా పంచుకున్న కేటీఆర్, హరీశ్‌రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>