రేవంత్ సోదరుడు, మామకు హై కోర్టు షాక్​.. నోటీసులు జారీ!

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ సూదిని పద్మారెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. రంగారెడ్డి జిల్లా నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్ 75/1లో గల 2.10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ (Nanakramguda Land Case) వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమిని అక్రమంగా వీరిద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అనుమతించారని జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సీఎండీ మడల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని సదరు భూమిపై తక్షణమే స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులతో పాటు కొండల్ రెడ్డికి, సూదిని పద్మారెడ్డికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>