కలం, వెబ్ డెస్క్ : నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU) ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ (TG Education Shutdown) కు పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యా వ్యవస్థపై మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 24న తలపెట్టిన తెలంగాణ విద్యాసంస్థల బంద్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులపై పారదర్శకంగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరారు. విద్యావ్యవస్థకు స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే VBSA బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు.
Read Also: నాగర్ కర్నూల్ ఆస్పత్రి సిబ్బందికి MLA రాజేశ్ రెడ్డి వార్నింగ్
Follow Us On: Sharechat

