కలం, జోగులాంబ గద్వాల: ధరూర్ (Dharur) మండల పర్యటనలో భాగంగా బుధవారం ఖమ్మంపాడు గ్రామంలో వ్యవసాయ పొలాల్లోకి నేరుగా వెళ్లిన బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకె స్నిగ్దారెడ్డి (DK Snigdha Reddy) వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వరి పొలంలోకి దిగిన ఆమె.. రైతులు మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి, వారి జీవన విధానం, కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని అన్నారు. కేంద్రం నుండి వచ్చే సహాయం ప్రతి ఒక్కరికి అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా పడటం వల్ల రైతులు నిరుత్సాహంలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు.. డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On : WhatsApp

