రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ స్కూల్ విద్యార్థినిపై ఉన్మాది దాడి (Rapthadu School Attack) చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘విద్యార్థిని తల్లితో ఫోన్‌లో మాట్లాడాను. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థినిని కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు నాకు చెప్పారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో మాట్లాడి నిరంతరం పర్యవేక్షించాలని సూచించాను. ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించాను’ అని పేర్కొన్నారు.

ఆ ఉన్మాది.. సమీప బంధువే

విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఉన్మాది హేమంత్ సదరు బాలికకు సమీప బంధువుగా చెబుతున్నారు. ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా వెంటపడుతున్న హేమంత్.. ఆమె అంగీకరించకపోయేసరికి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలికపై దాడి అనంతరం ధర్మపురం రైల్వే స్టేషన్ వైపు తప్పించుకుని పారిపోతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>