కలం, కరీంనగర్ బ్యూరో : మానసికంగా, శారీరకంగా వైకల్యం కలిగిన విద్యార్థులకు సేవ చేస్తే మనిషికి గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Media Academy Chairman) అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Timmapur) మండలం ఎల్ఎండీ కాలనీ మహాత్మానగర్ లో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధో దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల 36వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ట్రస్టు సభ్యులతో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) మాట్లాడుతూ, జన్యు లోపాలతో మేధోపరమైన వెనుకబాటుతనం కలిగిన బాల బాలికల కోసం స్వాతంత్య్ర సమరయోధులు ముందు చూపుతో పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.
అంగ వైకల్యం ఒక ఎత్తు.. మానసిక వైకల్యం ఒక ఎత్తని తెలిపారు. చాడ వెంకటరెడ్డి తో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని.. ఈ పాఠశాలను తనకున్న పరిచయాలతో మరింత అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల కేటాయించిందని.. తనవంతుగా పాఠశాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని శ్రీనివాసరెడ్డి (Media Academy Chairman) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ పాఠశాలను తీసుకెళ్లి.. వారు సందర్శించేలా కృషి చేస్తానని హామినిచ్చారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్, ఐజేయు సెంట్రల్ ఈసీ మెంబర్ శేఖర్, ట్రస్టు సభ్యులు సత్యనారాయణ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: 6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా : బండి సంజయ్
Follow Us On: X(Twitter)

