Mobile Popup Ad
Mobile Popup Ad

జహీరాబాద్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక రసాభాస

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఎన్నికకు గైర్హాజరు కావడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది. ఎన్నిక సమయానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు.. బీఆర్ఎస్‌ కాన్సిలర్ల‌తో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ సభ్యులెవరూ రాకపోవడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం పట్టుకోవడంతోనే కాంగ్రెస్ కౌన్సిలర్లు వెనకడుగు వేశారని ఆయన మండిపడ్డారు. జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్, అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నికను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వ‌జ‌మెత్తారు. అధికారుల తీరుపై మండిపడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

Read Also: భువనగిరి కాంగ్రెస్‌లో ముసలం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>