కలం, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ భేటీ (Union Cabinet) ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) కేబినెట్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. బళ్లారి-గుంతకల్లు మధ్య 46 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం చేపడతామన్నారు. రూ.1264 మూడు, నాలుగో లైన్లు కూడా పూర్తి చేస్తామని ప్రకటించారు. వీటితో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు రవాణా మరింత సౌకర్యవంతంగా మారుతుందన్నారు. అలాగే వేదవతి నదిపై పెద్ద వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి ప్రకటించారు.
Read Also: ‘వాంగ్‌చుక్’ మరో అన్నా హజారే.. సీజేపీ, కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

