శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: కౌశిక్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అన్నారు. ఈ ఘటన కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో చూపుతోందని విమర్శించారు.శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన “ప్రభుత్వ హత్య” అని వ్యాఖ్యానించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక జీఓ విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ జీఓను తక్షణమే అమలు చేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి సంవత్సరం సుమారు ₹1500 కోట్లు విడుదల చేసి సంస్థను బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా బలహీనపడుతోందని ఆరోపించారు. కార్మికులు ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేమితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి ఆయన (Kaushik Reddy) చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని, బీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>