కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీదపడి ఏడవడం బీఆర్ఎస్ పార్టీకి బాగా అలవాటు అయిందని ఆయన మండిపడ్డారు. బుధవారం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ (BRS) నాయకులపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తమకంటే జూనియర్ అని.. ఆయన రాజకీయంగా ఎదిగింది టీడీపీలో కాదా? అని అన్నారు.
తెలుగు దేశంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా విజయరమణారావుకి ఇచ్చారని ఉద్యమాలు చేశాడని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ తప్పుడు విధానాలు పాటిస్తున్నారని.. వాళ్ల మీద ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయన్నారు. వీటిని తట్టుకోలేక ఏపీ సీఎం చంద్రబాబు మీద ఏడుస్తున్నారని బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: అక్కడ దీక్ష చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన..
Follow Us On: Pinterest


