కలం, వెబ్ డెస్క్ : వొడాఫోన్- ఐడియా (Vodafone – Idea) కంపెనీకి కేంద్ర కేబినెట్ భారీ ఊరట కల్పించింది. ఆ సంస్థ స్థూల ఆదాయాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసింది కేంద్ర కేబినెట్. ఆ మొత్తాన్ని 2032-2041 మధ్య చెల్లించేలా వెసలుబాటు కల్పించింది. అంటే ఇప్పటికిప్పుడు దాన్ని చెల్లించాల్సిన పని లేదు. వొడాఫోన్-ఐడియా లో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. దీనికి 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీఐ (Vi) నిలదొక్కుకోవాలి అనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
దీంతో పాటు మారటోరియం పీరియడ్ కు సంబంధించిన వీఐ (Vodafone – Idea) చెల్లించాల్సిన వడ్డీని కూడా రద్దు చేసింది కేంద్ర కేబినెట్. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలు మాత్రం 2025-26 నుంచి 2031 వరకు కచ్చితంగా చెల్లించాల్సిందే. ఇప్పుడు కొత్త బకాయిలకు సంబంధించిన ఊరట నిజంగా వీఐకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ నిర్ణయం వీఐకు ఎంత వరకు మేలు చేస్తుందనేది చూడాలి.
Read Also: ఆటో డ్రైవర్ టు ఎయిర్లైన్స్ ఓనర్.. ‘శంఖ్ ఎయిర్’ చైర్మన్ ఇన్స్పైరింగ్ జర్నీ
Follow Us On: Sharechat


