కలం వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో రైలు(train) నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు(Couple Dies). మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంరావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25), భవాని(19) గా గుర్తించారు.
సింహాచలం, భవానికి రెండు నెలల కిందటే వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా వీరిద్దరూ హైదరాబాద్(Hyderabad)లోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్ ప్రెస్(Machilipatnam Express) రైలులో బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలు నుంచి జారిపడి మృతి చెందారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేది తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ మృతి(Couple Dies) చెందటంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: అస్సాంలో రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి!
Follow Us On: Youtube


