epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కర్ణాటకలో తెలుగు బోర్డుల వివాదం.. రేవంత్ స్పందిస్తారా..?

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో మళ్లీ భాషా వివాదం తెరమీదకొచ్చింది. ఈ సారి తెలుగు  బోర్డులను తొలగించడం సంచలనం రేపుతోంది. కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి జిల్లా ప్రెసిడెంట్ జి.రాజశేఖర్ రాజన్న లోకల్ గా ఉండే దుకాణాల తెలుగు బోర్డులను తొలగించాడు. వాస్తవానికి బళ్లారిలో తెలుగు వాళ్లే చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే అక్కడ కన్నడతో పాటు తెలుగులోనూ దుకాణాలకు బోర్డులు ఉంటాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండే దుకాణాలు కర్ణాటక బార్డర్ దగ్గరకు ఉంటాయి కాబట్టి.. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ బోర్డులుంటాయి. అలా అని వాటి బోర్డులు తెలుగు సంఘాలు తొలగించలేదు కదా.

కేవలం కర్ణాటక(Karnataka)లో లేదంటే తమిళనాడులో మాత్రమే మనం ఇలాంటివి చూస్తుంటాం. కన్నడ, తెలుగు(Telugu Language) భాషలు చాలా దగ్గరగా ఉంటాయి. అయినా సరే తెలుగుపై కన్నడ భాషా సంఘాలు ఇలా కాంట్రవర్సీ చేయడంతో ఇది కాస్త పొలిటికల్ ఇష్యూ అవుతోంది. కర్నాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఒక్కటే కాబట్టి రేవంత్ ఏం చేస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రభుత్వాల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. కాబట్టి కర్ణాటకలో ఇబ్బందులు పడుతున్న తెలుగు వారి కోసం రేవంత్ కన్నడ ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఇలాంటి వివాదాల్లో పార్టీలు ఎంటర్ కాలేదు. కానీ ఇప్పుడు ఒకే పార్టీ నేతలే సీఎంలుగా ఉన్నారు కాబట్టి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం సీఎం సీటుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో రేవంత్ వారితో మాట్లాడుతారా లేదా అనేది సస్పెన్స్. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో వేరే భాషల్లో బోర్డులు ఉంటే ఎప్పుడూ ఇలాంటి వివాదం రాలేదు. అంతెందుకు హైదరాబాద్ లోని బర్కత్ పురలో ఉన్న రాఘవేంద్ర మఠం పేరు కన్నడలో కూడా ఉంది. అలా అని ఎవరైనా వివాదం చేశారా. తెలుగు, కన్నడ ప్రజలకు ఎన్నడూ ఇలాంటి భాషా వివాదాలు రాలేదు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రాష్ట్రాల మధ్య ఇలాంటివి సృష్టించొద్దని కోరుతున్నారు నెటిజన్లు.

Read Also: మేడారం జాతరకు శరవేగంగా ఏర్పాట్లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>