epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడారం జాతరకు శరవేగంగా ఏర్పాట్లు

కలం, వరంగల్ బ్యూరో: మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ మహాజాతరపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రూ. 150 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జాతర జరగనుండగా.. ఈ డిసెంబర్ చివరినాటికి అన్ని ఏర్పాట్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన మంత్రులతో మేడారం జాతర పనులపై సమీక్ష నిర్వహించారు. జాతర నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని.. త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గద్దెల నిర్మాణం, జంపన్న వాగులో స్నాన ఘట్టాల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రులు, అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆసియా ఖండింలోనే అతిపెద్ద జాతర

ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు (Medaram Jatara) కోటిమందికి పైగా భక్తులు వస్తారు. వారికి సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం, భక్తులకు క్యూ లైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. జంపన్న వాగులో భక్తులకు స్నాన ఘట్టాల ఏర్పాటుకు షెడ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఇరుపక్కల ఉండటం వల్ల దర్శనం సరిగ్గా కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే గోవిందరాజు, పగిడిద్దె రాజుల గద్దెలు ఒకే వరసలో ఉండేలా పూజారులు, అదివాసీ సంఘాలతో కలిసి కొత్త మాస్టర్‌ప్లాన్రూపొందించారు. అందుకనుగుణంగా జాతర పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

పెరుగుతున్న భక్తుల రద్దీ..

మేడారం జాతరకు ఏటికేడు భక్తుల తాకిడి పెరుగుతోంది. తెలంగాణ జిల్లాల నుండే కాక పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, మహారాష్ట్రతోపాటు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తల్లులను దర్శించుకొనేందుకు వస్తుంటారు. దైవ దర్శనం కోసం క్యూ లో వచ్చే భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని వెడల్పు చేయాలని, లక్షలాది భక్తులకు మెరుగైన దర్శనం, సౌకర్యాలు కల్పించేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

భక్తుల సౌకర్యం కోసం మార్పు

మేడారం గద్దెల మార్పు భక్తుల సౌకర్యం కోసమే చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గద్దెలచుట్టూ ప్రహారీలపై ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రాలు, ఆదివాసీల జీవన విధానం ఉంటుందని చెబుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టిన రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

Read Also: తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన ‘మహింద్రా’

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>