epaper
Tuesday, November 18, 2025
epaper

సీఎం రేవంత్ కోసం షూటింగ్‌లు బంద్.. !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని సన్మానించాలని తెలుగు ఫిలిం ఛాంబర్(Telugu film Chamber), తెలుగు ఫిలిం ప్రొద్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భావించాయి. అందుకోసం యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలోనే ఈ రోజు అన్ని సినిమాల షూటింగ్‌లను బంద్ చేశాయి. ఈ విషయాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి వెల్లడించారు.

Telugu film Chamber | సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామని ఇప్పటికే పలు సందర్బాల్లో సీఎం రేవంత్ తెలిపారు. ఈ క్రమంలోనే పరిశ్రమను నియంత్రించే పనులు ఎవరూ చేయొద్దని, వాటిని ప్రభుత్వం సహించదని స్పష్టం చేసారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని, అందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం సీఎంను సన్మానించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిశ్చయించుకుంది.

Read Also: ఎన్నికల వేళ 27 మంది నేతలపై ఆర్జేడీ వేటు..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>