వరంగల్(Warangal)లో ఘోరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. అంగన్‌వాడీలో టీచర్ కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లి తన బిడ్డను అమ్మమ్మ దగ్గర వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. ఎప్పటి తరహాలోనే చిన్నారి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. తన తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు.. చిన్నారిని పక్క గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో దుస్తులపై రక్తం మరకలు, ఒంటిపై గాయాలు ఉండటాన్ని చిన్నారి అమ్మమ్మ గమనించింది. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే అంగన్‌వాడీలోని చిన్నారులను సదరు నిందితుడు ఎప్పుడూ వేధిస్తుండేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Also: కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం..

