బీహార్(Bihar)లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలంటే ఏ పార్టీ అయినా దొరికినంత బలం అందుకోవాలని చూస్తుంది. కానీ, ఈసారి ఆర్జేడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నేతలపై వేటు వేసింది. ఈ విషయాన్ని ఆర్జేడీ పార్టీ చీఫ్ మంగని లాల్(Mangani Lal) మండల్ వెల్లడించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బహిష్కరణకు గురైన నాయకులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్‌జేడీ(RJD) బహిష్కరించిన నాయకుల్లో ఎమ్మెల్యేలు చోటే లాల్‌రాయ్, మహ్మద్ కమ్రాన్ తో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఇది వరకు బీజేపీ బీహార్(Bihar)లో కూడా ఇటువంటి చర్యలే తీసుకుంది. పలువురిపై బహిష్కరణ వేటు వేసింది. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తుండటంతో వారిపై వేటు వేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ బహిష్కరించిన నాయకుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పవన్ యాదవ్ కూడా ఉన్నారు. ఈసారి తనకు టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
Read Also: ఒవైసీ ముందు హైదరాబాద్‌ను కాపాడుకో: పీకే

