కోయ భాషలో ప్రసంగించి ఆకట్టుకున్న గ్రూప్‌-1 అధికారి ..!

కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట(Aswaraopeta ) లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గ్రూప్‌-1 అధికారి తాటి ప్రమోద్‌సాయి కోయ భాషలో ప్రసంగించి విశేషంగా ఆకట్టుకున్నారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్న కొమురం భీమ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ప్రమోద్‌సాయి కోయ భాషలో మాట్లాడడంతో స్థానిక యువత ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రమోద్ సాయి మాట్లాడుతూ.. సంస్కృతి, భాషలను కాపాడుకున్నప్పుడే జాతి అస్తిత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కోయ సమాజం నుంచి మరింత మంది యువత ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్‌-1 వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఆదివాసీ యువతకు ఉచితంగా మార్గదర్శకత్వం (గైడెన్స్) అందిస్తానని ఆయన ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>