Mobile Popup Ad
Mobile Popup Ad

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విజన్‌ను రెండు భాగాలుగా వర్గీకరించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి మన లక్ష్యం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమేనన్నారు. 2047 (Telangana Vision 2047) అంటే… స్వతంత్ర భారతదేశం నూరు వసంతాల మైలురాయికి చేరే సమయానికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం మన లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ‘ఇన్నాళ్లు అభివృద్ధికి ప్రాంతాల వారిగా, పట్టణాల వారిగా ప్రణాళికలు రచించారు. కానీ, మేం మొదటి సారి మొత్తం తెలంగాణ రాష్ట్రానికే మాస్టర్ ప్లాన్ రూపొందించాం. CURE, PURE, RARE‌గా తెలంగాణను వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని CURE‌గా, ఔటర్ నుండి త్రిబుల్ ఆర్ వరకు ఉన్న తెలంగాణను PURE‌గా, త్రిబుల్ ఆర్ నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న భాగాన్ని RARE‌గా అభివర్ణిస్తూ… ఆయా జోన్లలో 2047 నాటికి ఎటువంటి అభివృద్ధి నమూనా ఉండాలి, ఆ నమూనా ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకురావాలి అన్నది ఈ విజన్ డాక్యుమెంట్ లో స్పష్టంగా చెప్పాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

విధ్వంసాన్ని సరిచేస్తున్నాం

CURE ప్రాంతంలో గడచిన పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యావరణహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా, ప్రపంచ స్థాయి సర్వీస్ సెక్టార్‌కు హబ్‌గా తీర్చిదిద్దాలన్నది తమ ఆలోచన అని పేర్కొన్నారు. అందులో భాగమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ‘చెరువుల పునరుద్ధరణ, దానిలో భాగమే కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు ఆవలికి తరలించడం… దాని కోసమే హిల్ట్ పాలసీ, దానిలో భాగమే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రోత్సహించడం, ఆటోలకు రిట్రోఫిట్ లను అమర్చడం, ఆర్టీసీ బస్సులను నూరుశాతం ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, సోలార్ పవర్ ను ప్రోత్సహించడం… ఇలాంటి అనేక నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంది. హైదరాబాద్ లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన పరిసరాలు, పర్యావరణహిత జీవనం కల్పించాలన్నది మా సంకల్పం.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అల్లాడుతున్న ప్రధాన నగరాలు

‘ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, ముంబై, బెంగుళూరు లాంటి నగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ లాంటి సమస్యలతో ఆ నగరాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని చెప్పారు. వాటి నుండి మనం గుణపాఠాలు నేర్చుకోకపోతే, ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా మరో డిజాస్టర్ డెస్టినేషన్ గా మిలిగిపోదా!? మనం ఆలోచించుకోవాలి. ఉన్న నగరాన్ని సంస్కరించుకోవడం, కొత్త నగరాన్ని నిర్మించుకోవడం మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఇటువంటి విషయాల్లో రాజకీయాలు చేస్తే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.’ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>