గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు

కలం, తెలంగాణ బ్యూరో: గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధన్యవాదాలు తెలిపారు. బుధవారం గవర్నర్ ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను ఆవిష్కరిస్తూ… రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదని తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.

Read Also: అజిత్ పవార్ మరణంపై అమిత్‌షాకు సంచలన లేఖ

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>