కేసీఆర్, కేటీఆర్ వీడియో బయటపెట్టిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth) అసెంబ్లీలో మూసీ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. తాము మూసీనది ప్రాంతంలో ఉన్న ఇండ్లను తొలగించి వారికి వేరే దగ్గర ఇండ్లు ఇస్తామని చెబుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పుడు మూసీ నది బఫర్ జోన్ లో, ఎఫ్టీఎల్ లో ఉన్న ఇండ్లు తొలగిస్తుంటే వ్యతిరేకిస్తున్న బీఆర్ ఎస్ అగ్రనేతలు గతంలో ఏం మాట్లాడారో వినాలంటూ రేవంత్ ఓ వీడియో బయటపెట్టారు. అందులో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలపై మాట్లాడారు.

ఒకసారి అక్రమ కట్టడం మొదలు పెడితే.. నోటీసులు ఇవ్వకుండా వెంటనే కూల్చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కేసీఆర్ ఆ వీడియోలో చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు మ్యాక్సిమమ్ ఫ్లడ్ లెవల్, బఫర్ లెవల్ లాంటివి ఏమీ లేవని చెప్పారు. 2021లో టెక్నాలజీ సాయంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించామని.. ఆ పరిధిల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో తాము గుర్తించామని కేటీఆర్ చెప్పారు. సదరు ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేయాలని కేటీఆర్ ఆ వీడియోలో అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో చూపించిన తర్వాత సీఎం రేవంత్ (Revanth) మాట్లాడుతూ.. ‘అప్పుడు కేసీఆర్, కేటీఆర్ లకు అది సక్రమంగా కనిపించింది గానీ.. ఇప్పుడు ఎందుకు అక్రమంగా కనిపిస్తుంది. బీఆర్ ఎస్ వాళ్లకు కడుపునిండా విషమే ఉంది. 10వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని.. అప్పుడు కూలగొడుతామని కేసీఆర్, కేటీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు. మేం ముందే కూల్చకుండా వారికి ఇండ్లు ఇస్తాం.. తర్వాత ప్రాజెక్టు కడుతాం అని చెబుతుంటే కావాలని అడ్డుకుంటున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>