కలం, వనపర్తి : తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక, పర్యాటక, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు విద్వత్ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్వత్ సమ్మేళనం(Telangana Vidwath Sabha) లో రాబోయే ప్లవంగ నామ సంవత్సరంలోని పండుగల నిర్ణయాలపై పండితులు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు.
అనంతరం ప్రముఖ పంచాంగకర్త, విద్వత్ సభ సంయుక్త కార్యదర్శి ఓరుగంటి మనోహర్ శర్మ సిద్ధాంతి, దైవజ్ఞాన సిద్ధాంతి చేతుల మీదుగా యువ పంచాంగకర్త ఓరుగంటి నాగరాజు శర్మ సిద్ధాంతిని ఘనంగా సత్కరించారు. తండ్రి చేతుల మీదుగా ఈ సత్కారం అందుకోవడం తనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నాగరాజు శర్మ సిద్ధాంతి ఆనందం వ్యక్తం చేశారు.

