కేటీఆర్ పీఆర్వో మహేశ్ అరెస్ట్.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు

కలం, వెబ్ డెస్క్: కేటీఆర్ పీఆర్వో (KTR PRO) మహేశ్‌ను బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. పోలీస్ విధులకు ఆటంకం కల్గించిన కేసులో  విచారణ పేరుతో 35(3) సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఆయనను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్ అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ పీఆర్‌ఓ అరెస్ట్‌తో బొల్లారం, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆందోళన నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>